ఆలూరుకృష్ణప్రసాదు .
ఆకాకరకాయలు .
నిన్న అనుకోకుండా మార్కెట్ లో ఆకాకరకాయలు కనపడ్డాయి .
వెంటనే కొన్నాను.
ఆకాకరకాయ కూర రుచే భిన్నంగా ఉంటుంది .
ఆ గింజలు వేగి కూరకు మరింత రుచి వస్తుంది .
మరి ఆకాకరకాయ వేపుడు తయారీ విధానము.
కావలసినవి .
ఆకాకరకాయలు -- పావుకిలో
ఎండుమిరపకాయలు -- 3
చాయమినపప్పు -- స్పూను
ఆవాలు -- అర స్పూను .
నూనె -- నాలుగు స్పూన్లు
కరివేపాకు -- మూడు రెమ్మలు.
తయారీ విధానము .
ముందుగా ఆకాకరకాయలను చిన్న ముక్కలుగా , గింజలతో సహా తరుగు కోవాలి .
తర్వాత రెండు స్పూన్లు ఎండుకారంలో స్పూను జీలకర్ర మరియు సరిపడా ఉప్పు వేసి మిక్సీ లో మెత్తని పొడిగా చేసుకుని విడిగా ఉంచుకోండి .
తర్వాత స్టౌ మీద బాండీ పెట్టి మొత్తం నూనె పోసి ఎండుమిరపకాయల ముక్కలు , చాయమినపప్పు , ఆవాలు మరియు కరివేపాకు వేసి పోపు పెట్టుకుని తర్వాత ఆకాకరకాయ ముక్కలను కూడా వేసి మీడియం సెగన వేయించుకుని చివరగా సిద్ధం చేసుకున్న జీలకర్ర కారం వేసుకుని మరో మూడు నిముషాలు ఉంచి దింపుకోవాలి .
మెత్తగా ఇష్టమైన వారు మూతపెట్టి ముక్కలను మగ్గ పెట్టు కోవచ్చును.
అంతే ఎంతో రుచిగా ఉండే ఆకాకరకాయ వేపుడు సర్వింగ్ కు సిద్ధం.
0 comments:
Post a Comment