ఆలూరుకృష్ణప్రసాదు .
సంక్రాంతి స్పెషల్ వంటకం.
బొబ్బట్లు.
కావలసినవి .
మైదాపిండి -- ఒక కప్పు.
నూనె -- 2 స్పూన్లు
ఉప్పు -- చిటికెడు .
నెయ్యి -- ఒక కప్పు
యాలకులపొడి -- స్పూను
బొబ్బట్లు లోపల Stuff చేసుకోవడానికి .
పచ్చి శనగపప్పు - ఒక కప్పు
బెల్లం -- అర కప్పు
తయారీ విధానము .
ముందుగా మైదాపిండి లో చిటికెడు ఉప్పు వేసి స్పూను నూనె వేసి పొడి పిండి బాగా కలుపుకోవాలి .
తర్వాత ఆ పిండిలో కొద్ది కొద్దిగా నీరు పోసుకుంటూ పిండిని చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి .
తర్వాత ఆ పిండిలో మరో స్పూను నూనె వేసుకుని పిండిని మరింత మృదువుగా మెదాయించుకోవాలి .
దానిపై ఒక పలుచని గుడ్డను కప్పి ఒక ముప్పావు గంట సేపు పక్కన పిండి మరింత మృదువుగా అవ్వటానికి విడిగా ఉంచుకోవాలి .
తర్వాత పచ్చి శనగపప్పు ఒకసారి కడిగి ఒక గిన్నెలో వేసుకుని తగినన్ని నీళ్ళు పోసి కుక్కర్ లో పెట్టుకుని మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడకనివ్వాలి .
బెల్లం పొడి చేసుకుని ఉంచుకోవాలి .
మిక్సీ లో ఉడికిన పచ్చి శనగపప్పు , బెల్లం పొడి , యాలకుల పొడి వేసుకుని మెత్తగా వేసుకోవాలి .
ఆ తర్వాత ఒక అరిటాకును తీసుకుని దానిపైన నూనె రాసుకుని ఉంచుకోవాలి .
మైదాపిండిని నిమ్మకాయంత తీసుకొని పూరీ మాదిరిగా చేతితో వత్తుకుని అందులో పూర్ణం పిండిని పెట్టుకుని చేతితో మూసి వేసుకోవాలి .
దానిని నూనె రాసిన అరటి ఆకులో పెట్టి నూనె చేతితోనే పూరీల లాగా వత్తుకుని ,
స్టౌ మీద పెనం పెట్టుకుని పెనం మీద నెయ్యి వేసుకుని వత్తిన బొబ్బట్లను ఆకుతో సహా బోర్లించాలి .
రెండు వైపులా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూమాడకుండా కాల్చుకోవాలి .
ఇదే విధముగా ప్రతి బొబ్బట్లు చేసుకోవాలి .
అంతే ఎంతో రుచిగా ఉండే సంక్రాంతి స్పెషల్ బొబ్బట్లు సర్వింగ్ కు సిద్ధం .
0 comments:
Post a Comment