ఆలూరుకృష్ణప్రసాదు .
వంకాయ కాల్చిన పచ్చడి . ( వంకాయ బజ్జీ పచ్చడి )
కావలసినవి .
గుండ్రని వంకాయలు -- మూడు.
పచ్చిమిర్చి -- 8
కొత్తిమీర -- ఒక కట్ట
చింతపండు -- నిమ్మకాయంత
పసుపు -- కొద్దిగా
ఉప్పు -- తగినంత .
పోపునకు .
నూనె -- మూడు స్పూన్లు
ఎండుమిరపకాయలు --- 6
మినపప్పు -- స్పూను
ఆవాలు -- అర స్పూను
జీలకర్ర -- పావు స్పూను
ఇంగువ -- కొద్దిగా
తయారీ విధానము .
ముందుగా వంకాయలు పైన నూనె రాసి స్టౌ సిమ్ లో పెట్టి అన్ని వైపులా కాల్చుకుని చల్లారగానే తడి చేతితో పై తొక్క మరియు తొడిమ తీసుకుని వేరే ప్లేటులో పెట్టు కోవాలి .
వీటి పైన కొద్దిగా పసుపు వేసుకోవాలి .
చింతపండు విడదీసి నీళ్ళలో తడుపు కోవాలి .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి మొత్తం నూనె వేసి , నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిర్చి ముక్కలు , మినపప్పు , ఆవాలు , జీలకర్ర , ఇంగువ వేసి పోపు వేయించుకోవాలి .
పోపు చల్లారగానే ముందుగా మిక్సీ లో ఎండుమిరపకాయలు , చింతపండు , ఉప్పు వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి.
తర్వాత పచ్చిమిరపకాయలు మరియు వేసి మెత్తగా వేసుకోవాలి .
తర్వాత కాలిన వంకాయలు , మిగిలిన పోపు మరియు కొత్తిమీర కూడా వేసి ఒకసారి మిక్సీ వేసుకోవాలి .
అంతే దోశెలు , చపాతీలు మరియు భోజనము లోకి వంకాయ కాల్చిన పచ్చడి సిద్ధం.
0 comments:
Post a Comment