గోధుమ పిండితో తీపి కాజాలు.
ఆలూరి కృష్ణప్రసాదు
గోధుమ పిండి - పావు కిలో.
పంచదార - 150 గ్రాములు.
నెయ్యి - మూడు స్పూన్లు
యాలకుల పొడి - అర స్పూను.
సోడా ఉప్పు - చిటికెడు .
నూనె - పావు కిలో
తయారీ విధానము .
ముందుగా ఒక పావు కిలో గోధుమ పిండిలో , చిటికెడు సోడా ఉప్పు , మూడు స్పూన్లు నెయ్యి వేసుకుని తగినన్ని నీళ్ళు పోసుకుని చపాతీల పిండిలా కలుపుకోవాలి.
మూత పెట్టి ఒక గంట సేపు పిండిని నాన నివ్వాలి.
ఒక గంట అవ్వగానే పిండిని బాగా మెదాయించి నిమ్మకాయంత ఉండలుగా చేసుకోవాలి.
తర్వాత చపాతీల పీట పై అప్పడాల కర్రతో గుండ్రంగా పల్చగా వత్తుకుని చాకుతో Cross గా Daimond Shape లో Cut చేసుకోవాలి.
ఈ విధముగా అన్ని కాజాలు ఒకేసారి చేసుకోవాలి.
ఇప్పుడు స్టౌ మీద గిన్నె పెట్టుకుని మొత్తము పంచదార పోసుకుని అందులో ఒక అరగ్లాసు నీళ్ళు పోసుకోవాలి. తీగ పాకం వచ్చేదాకా ఉంచుకొని అందులో యాలకుల పొడి వేసుకోవాలి.
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి మొత్తము నూనెను పోసుకుని నూనె పొగలు,,వచ్చే వరకు నూనెను బాగా కాగ నివ్వాలి.
అందులో సిద్ధంగా ఉంచుకున్న కాజాలను వేసుకుని రెండు మూడు విడతలుగా వేసుకుని ఎరుపు రంగు వచ్చేవరకు వేగ నివ్వాలి.
వేగుతున్న కాజాలు పాకం లో వేసి ఒక ఏడెనిమిది నిముషాలు ఉంచి పాకము పట్టిన కాజాలు వేరే పళ్ళెము లోకి తీసుకోవాలి .
ఇలా అన్ని కాజాలు వేసుకుని తీసుకోవాలి.
అంతే . మధ్యాహ్నము అల్పాహారానికి గోదుమ పిండి తీపి కాజాలు సర్వింగ్ కు సిద్ధం.
ఇదే పద్ధతిలో మైదా పిండితో కూడా చేసుకొనవచ్చును .
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన రెసిపీ మేము తయారుచేయు విధానము మరియు ఫోటో తయారుచేయు సమయమున తీసినది.
0 comments:
Post a Comment