ఆలూరుకృష్ణప్రసాదు .
కందిపప్పు కొబ్బరిముక్కల పచ్చడి .
కావలసినవి .
కందిపప్పు -- ఒక కప్పు
పచ్చికొబ్బరి ముక్కలు -- ఒక కప్పు.
ఎండుమిరపకాయలు -- పది
జీలకర్ర -- స్పూను
చింతపండు -- చిన్న ఉసిరి కాయంత.
ఉప్పు -- తగినంత
ఇంగువ -- కొద్దిగా
పోపునకు .
ఎండుమిర్చి -- మూడు ముక్కలుగా చేసుకోవాలి
మినపప్పు -- స్పూను
ఆవాలు -- అర స్పూను
కరివేపాకు -- రెండు రెమ్మలు
నెయ్యి -- నాలుగు స్పూన్లు
తయారీ విధానము .
ముందుగా స్టౌ మీద బాండీ పెట్టి రెండు స్పూన్లు నెయ్యి వేసి నెయ్యి బాగా కాగగానే కందిపప్పు , ఎండుమిర్చి , జీలకర్ర మరియు ఇంగువ వేసి కందిపప్పు కమ్మని వేగిన వాసన వచ్చే వరకు వేయించుకోండి.
తర్వాత అందులోనే చిన్న ముక్కలుగా తరిగిన కొబ్బరి ముక్కలు వేసి పచ్చి వాసన పోయేవరకు ఉంచి దింపి వేరేగా పళ్ళెంలో తీసుకోండి .
పోపు చల్లారగానే ముందుగా మిక్సీ లో ఎండుమిరపకాయలు , వేగిన కొబ్బరి ముక్కలు , తడిపిన చింతపండు మరియు తగినంత ఉప్పు వేసి మెత్తగా మిక్సీ వేసుకోండి.
తర్వాత వేగిన కందిపప్పు కూడా వేసి , కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా మిక్సీ వేసుకోండి .
తర్వాత వేరే గిన్నెలో కి తీసుకోండి.
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి మిగిలిన రెండు స్పూన్లు నెయ్యి వేసి నెయ్యి బాగా కాగగానే ఎండుమిర్చి ముక్కలు , మినపప్పు , ఆవాలు మరియు కరివేపాకు వేసి పైన పోపు పెట్టుకోండి .
అంతే ఇడ్లీ , దోశెలు , గారెలు , చపాతీలు మరియు భోజనము లోకి ఎంతో రుచిగా ఉండే కందిపప్పు కొబ్బరి పచ్చడి సర్వింగ్ కు సిద్ధం.
0 comments:
Post a Comment