అమ్మ వారి ప్రసాదం .
కొబ్బరి పాలతో కొబ్బరి అన్నం.
తయారీ విధానము .
ముందుగా గిన్నెలో ఒక గ్లాసు బియ్యం పోసుకుని రెండు గ్లాసుల నీళ్ళు పోసుకుని ఒక పది హేను నిముషములు నానబెట్టుకుని నీళ్ళు వార్చుకోవాలి .
కొబ్బరి కాయను పగుల కొట్టి రెండు చిప్పలూ పచ్చి కొబ్బరి కోరాముతో తురుముకుని మిక్సీ లో వేసుకుని రెండు కప్పులు కొబ్బరి పాలు తీసుకోవాలి .
దాల్చిన చెక్క , బిర్యాని ఆకు , జీడిపప్పు , యాలకులు , లవంగాలు సిద్ధం చేసుకోవాలి .
మూడు పచ్చి మిర్చి సన్నగా తరుగు కోవాలి .
అల్లం సన్నగా తరుగు కోవాలి .
క్యారెట్ తీసుకుని ఎండు కొబ్బరి కోరాముతో తురుము కోవాలి .
ఇప్పుడు స్టౌ మీద కుక్కర్ పెట్టి మూడు స్పూన్లు నెయ్యి వేసి నెయ్యి బాగా కాగగానే ముందుగా బిర్యాని ఆకు , లవంగాలు , మిరియాలు , జీడిపప్పు , యాలకులు , క్యారెట్ తురుము , పచ్చి మిర్చి ముక్కలు , అల్లం ముక్కలు వేయించుకుని తర్వాత నాన బెట్టిన బియ్యం వేసి , అందులో కొబ్బరి పాలు , మరియు అర గ్లాసు నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి .
విజిల్ రాగానా పొదీనా ఆకు , సరిపడా ఉప్పు వేసి మరియు మూడు స్పూన్లు నెయ్యి వేసి గరిటతో బాగా కలుపుకోవాలి .
తర్వాత అమ్మ వారికి నివేదన చేసి అందరికీ సర్వ్ చేయాలి .
0 comments:
Post a Comment