ఆలూరుకృష్ణప్రసాదు .
నిమ్మకాయ చారు .
ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీళ్ళు పోసుకోండి .
అందులో పావు స్పూను పసుపు వేయండి .
రెండు పచ్చిమిర్చి ముక్కలుగా చేసి వేయండి .
రెండు రెమ్మల కరివేపాకు వేయండి .
తగినంత ఉప్పు వేయండి .
రెండు నిమ్మకాయలు కోసి వేరే కప్పులో రసం పిండుకోండి.
రెండు ఎండు మిరపకాయలు , స్పూను ధనియాలు , పావు స్పూను జీలకర్ర , నాలుగు మిరియాలు రోట్లో దంచుకోండి .
లేదా మిక్సీ లో పొడి వేసుకోండి .
చారుపొడి ఇంట్లో రెడీగా ఉంటే ఆ పొడి స్పూనున్నర వేసుకోవచ్చు .
అప్పుడు రసం పొడి కొట్టు కోనక్కర లేదు ,
ఇప్పుడు స్టౌ మీద చారు గిన్నె పెట్టి బాగా మరగ నివ్వండి .
అందులో నే చెప్పిన కొట్టిన పొడి గాని లేదా చారు పొడి గాని వేయండి .
బాగా కాగనిచ్చి దింపి పిండిన నిమ్మరసం అందులో పోసి గరిటతో బాగా కలపండి .
స్టౌ మీద కాగుతూ ఉండగా నిమ్మరసం పోస్తే చారు చేదు వస్తుంది .
కొత్తిమీర తరిగి అందులో వేయండి .
ఇప్పుడు స్టౌ మీద పోపు గరిటె పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే రెండు ఎండుమిర్చి ముక్కలు , కొద్దిగా మెంతులు , కొద్దిగా జీలకర్ర , పావు స్పూను ఆవాలు , కొద్దిగా ఇంగువ వేసి పోపు పెట్టుకోండి .
అంతే వేడి వేడి నిమ్మరసం తో చారు సిద్ధం .
మీకు హోటల్ చారు రుచి రావాలంటే పొడిలో రెండు వెల్లుల్లి రెబ్బలు దంపుకుని తెర్లేటప్పుడు వేసుకోండి .
అప్పుడు పోపులో ఇంగువ వేయవద్దు .
అంతే ఎంతో రుచిగా ఉండే నిమ్మ కాయ చారు సర్వింగ్ కు సిద్ధం .
0 comments:
Post a Comment