Tuesday, July 11, 2017

తోటకూర పులుసు

ఆలూరుకృష్ణప్రసాదు .
తోటకూర   పులుసు  .

కావలసినవి  .

తోటకూర   --   రెండు కట్టలు .
ఉల్లిపాయలు  --    మూడు
పచ్చిమిరపకాయలు  --  ఎనిమిది.
చింతపండు  --   నిమ్మకాయంత
కారం  ---  స్పూను
ఉప్పు  --  తగినంత
పసుపు  ---  కొద్దిగా

పోపునకు .

ఎండుమిరపకాయలు  --  4  మెంతులు  --  కొద్దిగా
ఆవాలు  ---  అర స్పూను
జీలకర్ర   ---   పావు స్పూను
నూనె  --  నాలుగు  స్పూన్లు
కరివేపాకు  --  రెండు  రెమ్మలు
ఇంగువ  ---  కొద్దిగా

తయారీ  విధానము  .

తోటకూర   అడుగు   వేళ్ళు  ముదరకాడలు  తీసేసి   రెండుసార్లు   బాగా  కడిగి  సన్నగా   తరుగు కోవాలి .

ఉల్లిపాయలు  ముక్కలుగా  తరుగు కోవాలి .

పచ్చిమిర్చి  నిలువుగా  తరుగు కోవాలి .

చింతపండు   విడదీసి  ఒక గ్లాసు  నీళ్ళు పోసి పది నిముషాలు   నానబెట్టుకుని  పల్చగా  రసం  తీసుకోవాలి .

ఎండుమిరపకాయలు   ముక్కలుగా   చేసుకోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద  బాండీ  పెట్టి  మొత్తము   నూనె  వేసి  నూనె  బాగా  కాగగానే  వరుసగా  ఎండుమిర్చి  ముక్కలు , మెంతులు , జీలకర్ర  , ఆవాలు , ఇంగువ  మరియు  కరివేపాకు   వేసి  పోపు  వేగగానే  ముందుగా  ఉల్లిపాయ ముక్కలు , పసుపు ,  ఒక స్పూను  కారం , తగినంత  ఉప్పు  వేసి  మూతపెట్టి  ముక్కలు  మూడు  వంతులు  పైగా  మగ్గేలా  పది  నిముషాలు  మగ్గ నివ్వాలి .

తరువాత  తరిగిన   తోటకూర  ,  చింతపండు  రసం ,  మరో  అరగ్లాసు నీళ్ళు  పోసి  మూత పెట్టి  ఆకు  అంతా  ఉల్లిపాయల తో  సహా  పూర్తిగా  ఉడికే  విధంగా  పది నిముషాలు   ఉంచాలి .

దింపే  ముందు  అర  గ్లాసు  నీళ్ళలో  స్పూను  బియ్యపు  పిండి  వేసి  స్పూను తో  బాగా  కలుపుకొని  ఉడుకుతున్న  పులుసుకూర లో  వేసి  మరో  అయిదు నిముషాలు  ఉడక నిచ్చి  దింపు కోవాలి .

అంతే  ఎంతో  రుచిగా   ఉండే  తోటకూర  పులుసు కూర  అన్నం లోకి  మరియు  చపాతీ ల లోకి   సర్వింగ్  కు  సిద్ధం.

ఇంక  కొంతమంది   చాలా  చిన్న  బెల్లం   ముక్క  ఉడికేటప్పుడు  వేస్తారు .

కొంతమంది  లేత  ఆనపకాయ  ముక్కలు  వేస్తారు .

మరి కొంతమంది   చింతపండు   బదులుగా   టమోటో ముక్కలు  వేస్తారు .

ఇదే  రెసిపీని  మీ  అభిరుచి  కనుగుణంగా  మార్చుకోవచ్చును .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి