Tuesday, July 11, 2017

పొదీనా కొత్తిమీర పచ్చడి

పొదీనా కొత్తిమీర పచ్చడి
ఆలూరుకృష్ణప్రసాదు .


పొదినా  మరియు  కొత్తిమీర  పచ్చడి .
పొదినా  ---  రెండు కట్టలు .
కొత్తిమీర  --  ఒక  కట్ట
పచ్చిమిర్చి  --   పది  
చింతపండు  ---  నిమ్మ కాయంత
పసుపు   ---  కొద్దిగా 
ఉప్పు  --  తగినంత 
బెల్లం  --  చిన్న ముక్క

పోపునకు .
నూనె  ---  అయిదు  స్పూన్లు 
ఎండుమిరపకాయలు  --  5   
మినపప్పు  ---  స్పూను .
మెంతులు  --  కొద్దిగా 
ఇంగువ  --  కొద్దిగా 
ఆవాలు  --  అర స్పూను

తయారీ విధానము  .
చింతపండు   విడదీసి  కొద్దిగా  నీళ్ళలో  తడిపి  ఉంచుకోవాలి .
పొదినా  ఆకు  వలుచుకొని  ఒక  కప్పు న్నర పొదినా  ఆకు సిద్ధంగా  ఉంచుకోవాలి .
కొత్తిమీర   కాడలు  తీసి  సిద్ధంగా  ఉంచుకోవాలి .
ఇప్పుడు   స్టౌ  మీద  బాండీ  పెట్టి  మొత్తం   నూనె  వేసి  నూనె  బాగా కాగగానే  వరుసగా  ఎండుమిరపకాయలు  , మినపప్పు , మెంతులు , ఆవాలు  , ఇంగువ వేసి  పోపు వేగాక  ఒలిచిన  పొదినా  ఆకులు , పచ్చిమిరపకాయలు మరియు  కొద్దిగా  పసుపు  వేసి మూత పెట్టి  ఓ  అయిదు  నిముషాలు    మగ్గనివ్వాలి .
పోపు చల్లారగానే  మిక్సీ లో  ఎండుమిరపకాయలు  , చింతపండు నీళ్ళతో సహా , తగినంత    ఉప్పు వేసి మిక్సీ  వేసుకోవాలి  .
తర్వాత  చిన్న బెల్లం  ముక్క , మగ్గిన  పొదినా  ఆకులు , పచ్చి మిర్చి  మిగిలిన  పోపు  మరియు  కొత్తిమీర   మొత్తం  వేసుకుని   మెత్తగా  మిక్సీ  వేసుకుని  ఒక  గిన్నెలో కి  తీసుకోవాలి .
అంతే . ఇడ్లీ , దోశె , చపాతీ  మరియు  అన్నం లోకి  కొత్తిమీర  మరియు  పొదీనా  వాసనతో  చట్నీ  సర్వింగ్  కు  సిద్ధం .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి