Monday, July 17, 2017

ఉసిరికాయ పచ్చడి

ఉసిరికాయ పచ్చడి .
ఆలూరు కృష్ణప్రసాదు .

మామూలుగా   సీజన్  లో  ఉసిరికాయ ముక్కలు గా తరుగుకుని   మెత్తగా   రోటిలో  తొక్కుకుని  లేదా  మిక్సీ లో వేసుకుని  ఒక జాడీలో  బాగా  నొక్కి పెట్టి , మూడు రోజులు  అలాగే   కదపకుండా  ఉంచి  నాలుగవ  రోజు  ఒక  బేసిన్  లోకి   తీసుకుని   సరిపడా  ఉప్పు  మరియు  పసుపు  వేసి  తిరిగి  జాడీలోకి  తీసుకుని   పెట్టుకుంటాము.
దానిని  ఉసిరికాయ  నూరని  పచ్చడి  అంటాము .
ఈ  పచ్చడి  పూర్తిగా  సంవత్సరం  నిల్వ ఉంటుంది .
ఎవరికైన  పొరపాటున   జాడిపై  పొర  లాగా  కట్టినా , అది  బూజు  అనుకుని  పచ్చడి  మొత్తము   పారేయవద్దు .
అది  ఉసిరికాయ  పచ్చడి  సహజ  లక్షణం .
ఆ  పై  పొర  తీసేస్తే  లోపల  పచ్చడి  అంతా  Fresh  గా  ఉంటుంది .
ఇక  ఉసిరికాయ  పచ్చడి  తయారీ  విధానము
కావలసినవి.
నూరని  ఉసిరి కాయ  పచ్చడి  --  ఒక   కప్పు .
ఎండుమిరపకాయలు  --  10 .
మెంతులు  ---  పావు  స్పూను 
మినపప్పు  --   స్పూను 
ఆవాలు  --  అర  స్పూను 
ఇంగువ  --  కొద్దిగా  
నూనె  --  నాలుగు  స్పూన్లు

తయారీ  విధానము .
ముందుగా  స్టౌ  మీద  బాండీ  పెట్టి   నూనె మొత్తము వేసి , నూనె బాగా కాగగానే  వరుసగా  ఎండుమిరపకాయలు  , మినపప్పు  , మెంతులు , ఆవాలు  మరియు  ఇంగువ  వేసి  పోపు  వేయించుకోవాలి .
పోపు  చల్లారగానే  మిక్సీ లో  ముందుగా   ఎండుమిరపకాయలు  వేసి  మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి .
తర్వాత  మిగిలిన పోపు  , మరియు  ఉసిరి కాయ  పచ్చడి  కూడా  వేసి  మిక్సీ   వేసుకోవాలి .
తర్వాత  వేరే  గిన్నెలోకి  పచ్చడి  తీసుకోవాలి .
నిల్వ  పచ్చడి  పెట్టే సమయంలో నే  సరిపడా  ఉప్పు వేసుకుంటాము  కనుక  ఇంక   మరలా ఉప్పు  వేయనవసరం  లేదు.
అంతే  పుల్ల  పుల్ల గా  ఎంతో  రుచిగా  ఉండే  ఉసిరి కాయ  పచ్చడి  భోజనము  లోకి  సర్వింగ్  కు  సిద్ధం .
ఈ నూరిన పచ్చడి  నాలుగు  రోజులు  నిల్వ  ఉంటుంది .
భోజనము లో  మొట్టమొదట గా  ముందు  వేడి  వేడి  అన్నంలో  నెయ్యి వేసుకుని  కలుపుకు  తినాలి .
అద్భుతమైన   రుచిగా  ఉంటుంది .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి