ఆలూరుకృష్ణప్రసాదు .
దొండకాయ టమోటో పచ్చడి.
కావలసినవి .
దొండకాయలు -- 200 గ్రాములు .
టమోటోలు -- మూడు .
పచ్చిమిరపకాయలు -- పది
చింతపండు -- చిన్న నిమ్మకాయంత
పసుపు -- కొద్దిగా
ఉప్పు -- తగినంత
కరివేపాకు -- మూడు రెమ్మలు
కొత్తిమీర -- చిన్న కట్ట .
పోపునకు .
నూనె -- అయిదు స్పూన్లు
ఎండుమిరపకాయలు -- 8
మినపప్పు --- స్పూను
మెంతులు -- పావు స్పూను.
ఆవాలు -- అర స్పూను
జీలకర్ర -- పావుస్పూను
ఇంగువ -- కొద్దిగా
తయారీ విధానము.
ముందుగా చింతపండు విడదీసి , చాలా కొద్ది నీళ్ళలో పది నిముషాలు తడిపి ఉంచుకోవాలి .
దొండకాయలు ముక్కలుగా తరుగు కోవాలి .
టమోటో లు కాస్త పెద్దవిగా తీసుకుని వాటి పై నూనె రాసి స్టౌ సిమ్ లో పెట్టి కాల్చుకుని చల్లారిన తర్వాత తడి చేతితో పై తొక్క తీసివేసి , విడిగా పళ్ళెంలో పెట్టుకోవాలి .
టమోటో లు గట్టిగా ఉన్నవి తీసుకోవాలి .
తర్వాత స్టౌ వెలిగించి బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి , నూనె బాగా కాగగానే దొండకాయముక్కలు , పచ్చిమిర్చి మరియు కొద్దిగా పసుపు బాండిలో వేసి మూతపెట్టి మీడియం సెగన మగ్గనివ్వాలి .
తర్వాత వీటిని వేరే పళ్ళెంలో తీసుకుని ఉంచుకోవాలి .
తిరిగి బాండి పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిర్చి , మెంతులు, మినపప్పు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ మరియు కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి .
తర్వాత ముందుగా మిక్సీ లో ఎండుమిరపకాయలు , చింతపండు , దొండకాయ ముక్కలు , పచ్చిమిర్చి తగినంత ఉప్పు మరియు చింతపండు వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి .
తర్వాత మిగిలిన పోపు , వొలిచి ఉంచిన టమోటోలు మరియు కొత్తిమీర కూడా వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి .
అంతే ఎంతొ రుచిగా ఉండే దొండకాయ టమోటో పచ్చడి ఇడ్లీ , దోశెలు , చపాతీలు మరియు భోజనము లోకి సర్వింగ్ కు సిద్ధం.