Wednesday, July 4, 2018

వంకాయ పెరుగు పచ్చడి

ఆలూరుకృష్ణప్రసాదు .

వంకాయ    పెరుగు పచ్చడి.

రెండు  వంకాయలు తీసుకుని  పుచ్చులు లేకుండా చూసుకుని  కాయ అంతా  నూనె  రాసి   స్టౌ వెలిగించి సిమ్ లో పెట్టుకుని , కాయలను మధ్య మధ్య తిప్పుతూ అన్ని  వైపులా  బాగా  కాల్చుకోవాలి.

చల్లారాక   నీళ్ళతో తడి  చేయి చేసుకుని  పై  పొట్టు  తీసేసుకోవాలి.

తిరిగి స్టౌ  వెలిగించి   బాండీ  పెట్టి  రెండు  స్పూన్లు  నెయ్యి  వేసి  రెండుఎండు మిర్చి  ముక్కలుగా చేసి , స్పూను  మినపప్పు  ,అర స్పూను  ఆవాలు , పావు స్పూను జీలకర్ర  , కొద్దిగా  ఇంగువ మరియు  రెండు రెమ్మలు కరివేపాకు  వేసి పోపు  వేయించు కోవాలి .

ఒక  కట్ట కొత్తిమీర , మూడు పచ్చిమిర్చి  మరియు కొద్దిగా  ఉప్పు వేసి మిక్సీ లో తిప్పుకోవాలి .

ఒక  గిన్నెలో   కాల్చి  పై  తొక్క తీసి సిద్ధంగా  ఉంచుకున్న   వంకాయలు   , రెండు కప్పుల పెరుగు వేసి  , కొంచెం  ఉప్పు వేసి  చేత్తో  బాగా  కలుపు కోవాలి .

తర్వాత సిద్ధంగా  ఉంచుకున్న  కొత్తిమీర మరియు పచ్చిమిర్చి   పేస్ట్  కూడా వేసి  స్పూనుతో బాగా కలుపుకోవాలి .

ఆ  తర్వాత  సిద్ధం  చేసుకున్న   పోపు   అందులో  వేసుకొని  బాగా  కలిపి  పైన  కొత్తిమీర   వేసుకోవాలి .

అంతే  వంకాయ  పెరుగు  పచ్చడి  సర్వింగ్  కు  సిద్ధం.

ఈ పచ్చడి  భోజనము  లోకి  మరియు దోశెలలోకి కూడా బాగుంటుంది .

సంబంధించిన  రెసిపీ  మరియు ఫోటో నా స్వంతం .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి