బొంబాయి చట్నీ .
కావలసినవి .
శనగపిండి --- మూడు స్పూన్లు
చింతపండు -- ఉసిరి కాయంత
నీళ్ళలో పది నిముషముల ముందు నానబెట్టి పల్చగా గ్లాసుడు రసం తీసుకోవాలి .
పచ్చిమిరపకాయలు -- 5 .
ముక్కలుగా తరుగు కోవాలి.
ఉప్పు -- తగినంత
పోపునకు .
నూనె -- రెండు స్పూన్లు
పచ్చి శనగపప్పు -- స్పూనున్నర .
మినపప్పు -- స్పూను
జీలకర్ర -- పావు స్పూను
ఆవాలు -- అర స్పూను
కరివేపాకు -- రెండు రెమ్మలు.
పసుపు -- కొద్దిగా .
తయారీ విధానము .
ముందుగా సిద్ధంగా ఉంచుకున్న చింతపండు రసంలో శనపిండి , పసుపు, తగినంత ఉప్పు వేసుకుని అవసరమయితే మరో పావు గ్లాసు నీళ్ళు పోసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే వరుసగా ఎండు మిరపకాయలు ముక్కలు , పచ్చి శనగపప్పు , మినపప్పు , జీలకర్ర , ఆవాలు , పచ్చిమిర్చి ముక్కలు మరియు కరివేపాకు వేసి పోపు వేసుకోవాలి .
పోపు వేగగానే సిద్ధంగా ఉంచుకున్న శనగపిండి నీళ్ళను పోపులో పోసుకుని అట్ల కాడతో బాగా కలుపు తుండాలి .
అయిదు నిముషములు అవ్వగానే శనగపిండి నీళ్ళలో బాగా ఉడుకుతూ దగ్గర పడగానే దింపుకోవాలి.
ఈ పచ్చడిలో శనగపిండి ఎక్కువైతే గట్టిగా ఉంటుంది .
అంత రుచిగా ఉండదు .
కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుంది.
ఈ పచ్చడి వేడిగా తింటేనే బాగుంటుంది.
నాలుగు గంటల కంటే నిల్వ ఉండదు.
వేడిగా ఈ పచ్చడి ఇడ్లీ, దోశెలు, వడలు లోకి బాగుంటుంది .
0 comments:
Post a Comment