Friday, September 1, 2017

గోంగూర పచ్చడి

ఆలూరుకృష్ణప్రసాదు .

గోంగూరతో  పచ్చడి .

కావలసినవి .

గోంగూర  ---  కట్టలు  -- 2

కట్టలు  విడదీసి  నీళ్ళలో   ముంచి ఇసుక  లేకుండా  బాగా   కడిగి  ఒక్కొక్క  ఆకు  వలుచుకుని  నీడలో  ఆర బెట్టు కోవాలి .

పచ్చి మిరపకాయలు  --  పది

ఉప్పు  --  తగినంత

పసుపు  --  కొద్దిగా.

నూనె  ---  రెండు  స్పూన్లు

పోపుకు  .

నూనె  --  మూడు  స్పూన్లు

మినపప్పు  --  స్పూనున్నర

ఆవాలు  --  స్పూను.

ఇంగువ  ---  కొద్దిగా

తయారీ  విధానము .

ముందుగా  స్టౌ  వెలిగించి  బాండీ  పెట్టి  రెండు  స్పూన్లు   నూనె  వేసి  నూనె  బాగా కాగగానే  వలుచుకుని  సిద్ధముగా  ఉంచుకున్న   గోంగూర , పచ్చి మిరపకాయలు  , పసుపు  మరియు  సరిపడా  ఉప్పు వేసి  మూత పెట్టి  బాగా ఆకును    మగ్గ నివ్వాలి .

చల్లారిన  తర్వాత  ఈ  మొత్తము  మిశ్రమము  మిక్సీ లో  మెత్తగా  వేసుకోవాలి .

తర్వాత  వేరే  గిన్నెలోకి  తీసుకోవాలి .

మళ్ళీ   స్టౌ  మీద  బాండీ  పెట్టి  మూడు  స్పూన్లు   నూనె వేసి  నూనెను  బాగా  కాగనిచ్చి వరుసగా  ఎండు మిరపకాయలు ముక్కలు , ఆవాలు  మరియు  ఇంగువ  వేసి  వేడి  వేడి  పోపు  పచ్చడిలో  వేసుకుని  స్పూనుతో  బాగా  కలుపుకోవాలి .

అంతే  ఇంగువ  సువాసనతో  పుల్ల పుల్లని  రుచితో  గోంగూర  రోటి పచ్చడి  భోజనము  లోకి  సర్వింగ్  కు సిద్ధం.

1 comments:

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి