Saturday, April 14, 2018

కొండ గోంగూర ఆకుతో పచ్చడి .

ఆలూరుకృష్ణప్రసాదు .

కొండ గోంగూర  ఆకుతో  పచ్చడి .

కొండ  గోంగూర  అంటే  పుల్ల గోంగూర.

ఈ  కూర  సంవత్సరం  మొత్తం  మనకి దొరుకుతుంది  .

రెండు  కట్టలు  తెచ్చుకుని   ఆకును  వలుచుకుని  కాసేపు  ఆర బెట్టు కోవాలి  .

ఒక  ఆరు పచ్చి మిరపకాయలు తొడిమలు తీసి ఉంచుకోవాలి .

స్టౌ  మీద  బాండీ  పెట్టి  ఒక  మూడు  స్పూన్లు   నూనె  వేసి  గోంగూర  ఆకును మరియు  పచ్చిమిర్చి   కొద్దిగా  ఉప్పును    వేసి  మూత  పెట్టి  మెత్తగా  మగ్గ నివ్వాలి .

తర్వాత  వేరే  ప్లేటు లోకి  తీసుకోవాలి  .

తిరిగి  స్టౌ  మీద  బాండీ  పెట్టి  మూడు  స్పూన్లు   నూనె  వేసి  నూనె  బాగా  కాగగానే   ఎనిమిది   ఎండుమిరపకాయలు , పావు స్పూను  మెంతులు , స్పూనున్నర   మినపప్పు  ,  అర  స్పూను   ఆవాలు  మరియు  కొద్దిగా   ఇంగువ     వేసి  పోపు  పెట్టుకోవాలి .

ఆ  తర్వాత  మిక్సీ లో  ముందుగా   ఎండుమిరపకాయలు , సరిపడా  ఉప్పు , కొద్దిగా  పసుపు  వేసి   మెత్తగా   వేసుకోవాలి  .

ఆ తర్వాత  వేయించిన  గోంగూర  పచ్చి మిర్చి మిక్సీ లో  వేసి  మరీ మెత్తగా కాకుండా వేసుకోవాలి .

చివరగా  మిగిలిన  పోపు  వేసుకుని   ఒకసారి  పై పైన  మిక్సీ  వేసుకుని   వేరే  గిన్నెలోకి  తీసుకోవాలి  .

అంతే  ఎంతో  రుచిగా  పుల్ల పుల్లగా  నోరూరించే  కొండ  గోంగూర  పచ్చడి  భోజనము  లోకి  సర్వింగ్  కు  సిద్ధం .

సంబంధిత  రెసిపీ మరియు ఫోటో నా స్వంతం .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి