Saturday, April 14, 2018

కాప్సికమ్ , శనగపిండి మరియు ఉల్లిపాయల తో  స్టఫింగ్  కాయల పళంగా కూర

కాప్సికమ్ , శనగపిండి మరియు ఉల్లిపాయల తో  స్టఫింగ్  కాయల పళంగా కూర .

కావలసినవి .

కాప్సికమ్  చిన్న కాయలు --  అర కిలో  లేదా 12 
శనగపిండి  --  100  గ్రాములు
ఉల్లిపాయలు  --  3
జీలకర్ర  పొడి  --   స్పూను
కారము  --  స్పూనున్నర
ఉప్పు --  తగినంత
నూనె  --  ఆరు స్పూన్లు .

తయారీ విధానము .

ముందుగా  కాప్సికమ్  శుభ్రంగా కడుగుకుని 
నాలుగు పక్షాలుగా  చేసుకోవాలి .

ఉల్లిపాయలు  చిన్న ముక్కలుగా  తరుగు కోవాలి .

కారము  జీలకర్ర  పొడి మరియు సరిపడా  ఉప్పు వేసి ఈ మూడు  బాగా కలుపుకోవాలి .

స్టౌ మీద బాండీ పెట్టి  (  నూనె వేయకుండా  ) శనగపిండి  కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకోవాలి .

వేయించిన  పిండిలో  జీలకర్ర పొడి , కారము మరియు ఉప్పు కలిపిన మిశ్రమమును  వేసి  చేతితో బాగా కలుపుకుని  విడిగా ప్లేటులో  తీసుకుని  ఉంచుకోవాలి .

ఇప్పుడు  స్టౌ మీద బాండీ పెట్టి  మూడు స్పూన్లు  నూనె  వేసి , నూనె బాగా కాగగానే  ఉల్లిపాయల  ముక్కలను వేసి మూతపెట్టి  ముక్కలను బాగా  మగ్గనివ్వాలి .

ఉల్లిపాయలు  పూర్తిగా  మగ్గిన తర్వాత  వేయించి  విడిగా ఉంచిన  మిశ్రమము  వేసి  కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకుని  దింపుకోవాలి .

తర్వాత  ఈ వేగిన మిశ్రమము  నాలుగు పక్షాలుగా తరిగిన  కాప్సికమ్  లో నిండుగా  కూరుకోవాలి .

మిగిలిన   మిశ్రమమును  విడిగా  ఉంచుకోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద  బాండీ  పెట్టి  మొత్తము  నూనె  వేసి , నూనె  బాగా  కాగగానే  బాండీలో  మొదట  ఆరుకాయలను  వేసి , మూతపెట్టి మధ్యమధ్యలో  అట్లకాడతో  కదూపుతూ  బాగా  మగ్గనివ్వాలి .

కాయలు మగ్గిన తర్వాత మిగిలిన ఆరు కాయలు  కూడా వేసి  పైన చెప్పిన విధముగా  మగ్గనివ్వాలి .

ఇప్పుడు  వేయించి విడిగా  ఉంచుకున్న  కాయలను  కూడా వేసి  , విడిగా  తీసుకొని  ఉంచుకున్న  మిశ్రమమును  కూడా  వేసి ఒక అయిదు నిముషాల  పాటు మూత తీసి  వేగ నిచ్చి  దింపుకుని  విడిగా ప్లేటులోకి  తీసుకోవాలి .

అంతే  ఎంతో రుచిగా  ఉండే  కాప్సికమ్  శనగపిండి  ఉల్లిపాయల కాయల పళంగా  స్టఫ్  చేసిన  కూర భోజనము లోకి  సర్వింగ్  కు సిద్ధం.

హామీ పత్రం .

సంబంధిత  రెసిపీ  మరియు  ఫోటో  నా  స్వంతం.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి