Thursday, August 31, 2017

మామిడికాయ పచ్చడి

ఆలూరుకృష్ణప్రసాదు .

ఈ రోజు  స్పెషల్ .

మామిడి కాయ  పచ్చడి .

కావలసినవి .

పుల్లని  గట్టిగా  ఉన్న  పచ్చి మామిడి కాయ  --  1

పై  చెక్కు తీసుకుని  చిన్న చిన్న ముక్కలుగా  తరగాలి .

కారం  --  మూడు  స్పూన్లు

ఉప్పు  --   తగినంత

బెల్లం  --  చిన్న  ముక్క (  షుమారు  25  గ్రాములు  )

పసుపు  --  పావు స్పూను

మెంతి  పిండి  --  అర  స్పూను .

పోపునకు .

ఎండుమిరపకాయలు  --  4 
చిన్న  ముక్కలుగా  చేసుకోవాలి .
ఆవాలు  --  అర  స్పూను
ఇంగువ  --  కొద్దిగా
నూనె  --  నాలుగు  స్పూన్లు

తయారీ  విధానము .

ముందుగా  మిక్సీ లో  మామిడి కాయ  ముక్కలు , ఉప్పు  మరియు  పసుపు  వేసి  మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి .

ఆ  తర్వాత  అందులోనే  మూడు స్పూన్లు  ఎండు కారం , అర  స్పూను  మెంతి  పిండి మరియు  25  గ్రాముల  బెల్లం వేసి    మెత్తగా   మిక్సీ  వేసుకోవాలి .

ఆ తర్వాత  వేరే  గిన్నెలోకి  తీసుకోవాలి .

తర్వాత  స్టౌ  మీద  పోపు  గరిటె  పెట్టి  నాలుగు  స్పూన్లు   నూనె  వేసి  నూనెను  బాగా  కాగ నివ్వాలి .

నూనె  బాగా  కాగగానే   అందులో  ఎండుమిర్చి  ముక్కలు , ఆవాలు , ఇంగువ  వేసి  ఆ  వేడి  వేడి  పోపు  నూనెతో  సహా  పచ్చడిలో  వేసి  స్పూనుతో  పచ్చడి  అంతా  బాగా  కలుపుకోవాలి .

అంతే  తియ్య తియ్యగా , పుల్ల పుల్లగా  ఇంగువ   ఘుమ  ఘుమలతో  ఇడ్లీ , దోశెలు , గారెలు , చపాతీలు , రోటీలు  మరియు  భోజనము  లోకి  వెరైటి  మామిడి  కాయ పచ్చడి సర్వింగ్  కు  సిద్ధం.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి