Thursday, August 31, 2017

నారింజకాయ కారం

నారింజ  కాయ కారం.

కావలసినవి .

నారింజ కాయలు  --  రెండు.
ఎండుమిరపకాయలు  --  15
మెంతులు   ---  స్పూనున్నర 
ఆవాలు  ---  రెండు  స్పూన్లు ఉప్పు   --  తగినంత
నూనె  ---  మూడు స్పూన్లు

పోపునకు .

నూనె  ---  రెండు  స్పూన్లు
ఆవాలు  ---   అర  స్పూను
ఇంగువ  ---  కొద్దిగా

తయారీ  విధానము .

నారింజ కాయలు  పై  తొక్క తీసుకుని  తొనల  లోపల  ముత్యాలను  చేదు  రాకుండా  ఒలుచుకొని  ఒక  గిన్నెలోకి  రసంతో సహా తీసుకోవాలి .

స్టౌ మీద బాండీ  పెట్టి  మూడు స్పూన్లు  నూనె వేసి  నూనె  బాగా కాగగానే  ఎండుమిరపకాయలు , మెంతులు , ఆవాలు మరియు  ఇంగువ   వేసి  ఎరుపు రంగు  వచ్చే  వరకు  వేయించుకోవాలి.

చల్లారగానే అందులో  సరిపడా  ఉప్పు వేసి  మిక్సీ లో మెత్తగా  పొడి  చేసుకోవాలి.

ఇప్పుడు  ఆ పొడిని  ఒక గిన్నెలో  వేసి  ఒలిచిన ముత్యాలను  వచ్చిన రసంతో సహా వెయ్యాలి .

స్పూనుతో బాగా కలుపుకోవాలి.

ఆ తర్వాత  స్టౌ మీద  బాండీ  పెట్టి  రెండు  స్పూన్లు  నూనె  వేసి  నూనె బాగా కాగగానే  రెండు ఎండుమిర్చి  ముక్కలుగా  చేసి , ఆవాలు మరియు  కొంచెం ఇంగువ వేసి  పోపు  పచ్చడిలో  కలుపుకోవాలి .

అంతే  ఎంతో  రుచిగా  ఉండే  నారింజ  కాయల కారం ఇడ్లీ , దోశెలు మరియు  అన్నం లోకి  సర్వింగ్ కు సిద్ధం .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి