Sunday, November 12, 2017

పెద్ద ఉసిరి పచ్చడి

పెద్ద ఉసిరికాయల తో  పచ్చడి .

ఇది పెద్ద ఉసిరి కాయల ఏడాది నిల్వ పచ్చడి కాదు .

నాలుగైదు రోజులు నిల్వ ఉండే  పచ్చడి .

నిల్వ పచ్చడి  పెట్టుకోవాలంటే మరో రెండు నెలలు ఆగాలి.

కాయ ముదరాలి .అప్పుడు పచ్చడి నిక్షేపంగా  ఏటి కేడాది నిల్వ ఉంటుంది.

మాకు తెలిసిన పక్కింటి వారు వారి ఉసిరి చెట్టు కాయలు కోస్తూ మాకు ఒక కిలో కాయలు ఇచ్చారు .

దానితో  రెండు రకముల  తాత్కాలికంగా  నిల్వ ఉండే పచ్చళ్ళు  చేసాము .

అందులో  ఈ ఉసిరికాయ  పచ్చడి .

కావలసినవి.

ఉసిరికాయలు  --  అర కిలో
నూనె  --  ఆరు  స్పూన్లు
ఎండుమిరపకాయలు  --  20
మెంతులు  --  స్పూనున్నర .
ఆవాలు  --  స్పూను
ఇంగువ  --   కొద్దిగా
పసుపు  --  కొద్దిగా
ఉప్పు  --  తగినంత

తయారీ విధానము .

ముందుగా స్టౌ మీద  ఒక  గిన్నెలో  మూడు స్పూన్లు  నూనె వేసి నూనె బాగా కాగగానే   ఉసిరి కాయలు వేసి  మూత పెట్టి , పది నిముషాలు  మీడియం సెగన మగ్గ నివ్వాలి .

చల్లారగానే  కాయలను చేతితో చిదిపి మధ్యన గింజలను  తీసేసుకోవాలి .

అవి వేరే ప్లేటులోకి  తీసుకుని , ముక్కల పైన పసుపు  వేసుకోవాలి .

ఇప్పుడు మళ్ళీ స్టౌ వెలిగించి  బాండీ పెట్టి  మూడు స్పూన్లు వేసి నూనె బాగా కాగగానే వరుసగా మెంతులు , ఎండుమిరపకాయలు , ఆవాలు  మరియు ఇంగువ వేసి పోపు వేయించుకోవాలి .

పోపు చల్లారగానే  మిక్సీ లో  వేగిన పోపు సరిపడా ఉప్పు వేసి   మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి .

తర్వాత  మగ్గిన ముక్కలను కూడా వేసి పచ్చడి మెత్తగా  వేసుకుని  , వేరే గిన్నెలోకి  తీసుకోవాలి .

అంతే  ఎంతో రుచిగా ఉండి , ఐదు రోజులు  నిల్వ ఉండే  ఉసిరికాయ  పచ్చడి  భోజనము లోనికి  సిద్ధం.

ఈ పచ్చడి  వేడి వేడి అన్నంలో , నెయ్యి వేసుకుని  మొదట తింటే అద్భుతమైన  రుచిగా ఉంటుంది .

ఆరోగ్యానికి  కూడా ఉసిరి పచ్చడి చాలా మంచిది.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి