Sunday, November 12, 2017

వాము ఆకు పచ్చడి

ఆలూరుకృష్ణప్రసాదు .

వాము ఆకుతో పచ్చడి .

వాము ఆకు అప్పుడప్పుడు  వాడితే ఆరోగ్యానికి  చాలా మంచిది .

కనీసం మూడు నెలలకు ఒక్కసారి  అయినా  వాము పొడి  కాని  వాము ఆకు కాని  వాడితే  ఉదరం శుభ్ర పడుతుంది .

ఈ వాము ఆకుతో చాలా మంది బజ్జీలు వేసుకుంటారు .

వాము ఆకుతో పచ్చడి కూడా చేసుకోవచ్చు .

కావలసినవి .

తెల్లనువ్వుపప్పు  -  50  గ్రాములు .

రెండు ఎండుమిరపకాయలు , నువ్వు పప్పు   నూనె వేయకుండా బాండిలో  వేయించుకుని , చల్లారగానే  మిక్సీలో పొడిగా  చేసుకుని  వేరేగా  తీసి ఉంచుకోవాలి .

వాము ఆకులు  --  షుమారు 30
నూనె --  మూడు  స్పూన్లు
ఎండుమిరపకాయలు  -  8
చింతపండు  --  ఉసిరి కాయంత
మెంతులు --  అర స్పూను
ఆవాలు  --  అర స్పూను
పసుపు  --  కొద్దిగా
ఇంగువ --  కొద్దిగా
ఉప్పు  --  తగినంత

తయారీ విధానము .

ముందుగా  వాము  ఆకులను  కడిగి  శుభ్రం చేసుకోవాలి .

స్టౌ మీద బాండీ పెట్టి  స్పూనున్నర  నూనె వేసి నూనె బాగా కాగగానే  ముందుగా  మెంతులు తర్వాత  ఎండుమిరపకాయలు ,  ఆవాలు మరియు  ఇంగువ  వేసి పోపు వేయించుకొని  వేరే ప్లేటులోకి  విడిగా  తీసుకోవాలి .

తర్వాత తిరిగి  స్టౌ మీద బాండీ పెట్టి  మిగిలిన నూనె వేసి నూనె బాగా కాగగానే  వాము ఆకులు  మరియు కొద్దిగా  పసుపు వేసి  ఒక అయిదు నిముషాలు  ఆకును బాగా మగ్గనివ్వాలి.

తర్వాత  మిక్సీలో  వేయించిన  పోపును, చింతపండు   మరియు తగినంత  ఉప్పువేసి మెత్తగా  వేసుకోవాలి .

తర్వాత  మగ్గిన  వాము ఆకును కూడా వేసి  మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి.

చివరలో  నువ్వుల పొడి  కూడా వేసుకుని  మరోసారి  మిక్సీ  వేసుకుని  వేరేగా గిన్నెలోకి తీసుకోవాలి .

అంతే ఎంతో రుచికరమైన  వాము ఆకు పచ్చడి  సర్వింగ్  కు సిద్ధం.

ఈ పచ్చడి మొదటగా  వేడి వేడి అన్నంలో  నెయ్యి వేసుకుని  తింటే  చాలా రుచిగా  ఉంటుంది.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి