Thursday, November 16, 2017

పచ్చి టమోటాల పచ్చడి

ఆలూరుకృష్ణప్రసాదు .

పచ్చి టమోటాల   పచ్చడి .

కావలసినవి .

బాగా  పచ్చి  టమోటాలు  తయారైనవి  ---  ఎనిమిది
పచ్చి మిర్చి  ---  పది .
కరివేపాకు  ---  మూడు  రెబ్బలు
కొత్తిమీర   ---  ఒక  కట్ట.
చింతపండు  --  నిమ్మకాయంత
ఉప్పు  --  తగినంత
పసుపు  --  అర  స్పూను .
నూనె  --  రెండు  గరిటెలు .

పోపుకు  కావలసినవి .

ఎండుమిర్చి  -- ఎనిమిది
ఆవాలు  -   స్పూను
మినపప్పు  --  రెండు  స్పూన్లు
జీలకర్ర  --  అర స్పూను
ఇంగువ  --  తగినంత
మెంతులు  -  అర స్పూను .

తయారీ  విధానము --

ముందుగా  పచ్చి టమోటాలు  ముక్కలుగా   కోసుకోవాలి .

బాండీలో  నూనె  వేసుకుని   నూనె  కాగగానే  పచ్చి టమోటాలు , పచ్చి మిర్చి  ముక్కలను , కొద్దిగా  ఉప్పు , పసుపు  వేసి  మగ్గనివ్వాలి.

ఇప్పుడు  మళ్ళీ  బాండీలో  నూనె  వేసి  నూనె బాగా కాగగానే  ముందుగా  మెంతులు , ఎండుమిర్చి , మినపప్పు , జీలకర్ర  , ఆవాలు  మరియు కరివేపాకు  పోపు  పదార్ధములన్నీ  వేసి పోపు  పెట్టుకోవాలి.

ఇప్పుడు మిక్సీ లో  ముందుగా ఎండు మిర్చి , చింతపండు , ఉప్పు , వేసి   మెత్తగా మిక్సీ  వేసుకోవాలి.

మగ్గపెట్టిన టమోటా ముక్కలు,  పచ్చిమిరపకాయలు కొత్తిమీర  మిగిలిన  పోపు  వేసి  మరీ  మెత్తగా  కాకుండా మిక్సీ  వేసుకోవాలి.

తర్వాత  వేరే  గిన్నెలోకి  తీసుకోవాలి .

అంతే  ఘమ  ఘమ  లాడే  కొత్తిమీర ,ఇంగువ  వాసనలతో  పచ్చి టమోటో  పచ్చడి సర్వింగ్ కు  సిద్ధం .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి