Monday, February 5, 2018

బెండకాయ వేపుడు

ఆలూరుకృష్ణప్రసాదు .

బెండకాయ వేపుడు .  (  fry  ) 

ముందుగా  స్టౌ మీద  బాండీ పెట్టి రెండు స్పూన్లు  నూనె వేసి  నూనె బాగాకాగగానే ఆరు ఎండుమిరపకాయలు , స్పూను  పచ్చిశనగపప్పు , స్పూను  మినపప్పు , అర స్పూను  జీలకర్ర , మూడు  స్పూన్లు  ఎండుకొబ్బరి  ముక్కలు , రెండు  స్పూన్లు  పల్లీలు , మరియు  రెండు స్పూన్లు  నువ్వుపప్పు  వేసి  బాగా  వేయించుకోవాలి .

చల్లారగానే  మిక్సీ లో  తగినంత  ఉప్పు వేసుకుని  మెత్తగా  పొడి  చేసుకోవాలి .

ఆ పొడి  వేరుగా  ఉంచుకోవాలి .

తర్వాత పావుకిలో  బెండకాయలు  ముక్కలు గా తరిగి , స్టౌ వెలిగించి బాండీ పెట్టి నాలుగు
స్పూన్లు   నూనెవేసి  నూనె బాగా కాగగానే  బెండకాయ ముక్కలు వేసి బాగా  వేయించుకోవాలి .

తర్వాత  ముందుగా  సిద్ధం చేసుకున్న  పొడి  కూరలో  వేసి మరో   అయిదు నిముషాలు  ఉంచి  కమ్మని వాసన రాగానే  దింపి  వేరే  Dish లోకి  తీసుకోవాలి .

అంతే  ఎంతో  రుచిగా  ఉండే  బెండకాయ  వేపుడు  భోజనము లోకి  సర్వింగ్  కు సిద్ధం.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి