Monday, February 5, 2018

పంచదార పాకం గారెలు

పంచదార పాకం గారెలు.

తయారీ విధానము .

మినపగుళ్ళు  --  150 గ్రాములు.
పంచదార  --  100 గ్రాములు
ఏలకులపొడి  --  స్పూను
నూనె  --  350  గ్రాములు.

తయారీ విధానము .

మినపగుళ్ళు  ఒక గిన్నెలో  పోసుకుని  ఒకసారి  కడిగి  సరిపడా నీళ్ళు పోసుకుని  ఆరు గంటలు  సేపు నానబెట్టుకోవాలి .

తర్వాత  నీళ్ళు వడగట్టి  గ్రైండర్  లో  వేసుకుని  కొద్దిగా  నీళ్ళు పోసుకుని  గారెల పిండిలా  గట్టిగా   రుబ్బుకోవాలి .

ఆ తర్వాత  వేరే గిన్నెలోకి  తీసుకుని  చిటికెడు   ఉప్పు  వేసుకుని  గరిటెతో  బాగా  కలుపుకోవాలి .

మరల స్టౌ  మీద  గిన్నె పెట్టి  పంచదార  వేసి , పంచదార  మునిగే  వరకు  నీళ్ళు పోసి , మరీ  గట్టి పాకం కాకుండా  చేతి వేళ్ళకు  అంటుకునేలా  పాకం రానిచ్చి , యాలకుల పొడి  వేసి   దింపుకోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద  బాండీ  పెట్టి  మొత్తము  నూనె  పోసి నూనె  పొగలు  వచ్చే విధముగా  బాగా  కాగనివ్వాలి .

రుబ్బి సిద్ధంగా  ఉంచుకున్న  పిండిని  అరిటాకు  మీద  తడి చేతితో  గారెలు  మాదిరిగా వేసుకుని, రెండు వైపులా  బంగారు  రంగు  వచ్చేలా  వేయించుకోవాలి .

అలా  వేగిన  గారెలు  వెంటనే  పంచదార  పాకంలో  వేసి  మూడు నాలుగు గారెలు  పాకం  పీల్చుకోగానే  విడిగా  తీసుకోవాలి .

అంతే  జాంగ్రీల మాదిరిగా  పాకం పీల్చుకున్న  పంచదార  పాకం గారెలు  సర్వింగ్  కు సిద్ధం .

గోదావరి  జిల్లాలలో  పంచదార  బదులు  బెల్లం వాడి పైన చెప్పిన విధముగా  పాకం పట్టి  బెల్లంతో  పాకం గారెలు  చేస్తారు .

ఆ విధముగా  కూడా  చేసుకోవచ్చును .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి