Friday, September 1, 2017

మామిడి కాయ ముక్కల పచ్చడి

ఆలూరుకృష్ణప్రసాదు .

మామిడి  కాయ  ముక్కల  పచ్చడి .

పుల్లని  పచ్చి  మామిడి  కాయ  --  ఒకటి .

పై చెక్కు  తీసుకుని   చిన్న ముక్కలుగా  తరుగు  కోవాలి .

కారం  ---  మూడు  స్పూన్లు

ఉప్పు  --  తగినంత

పసుపు   --  కొద్దిగా

మెంతిపిండి  ---  ముప్పావు  స్పూను .

పోపునకు .

నూనె    ---  నాలుగు  స్పూన్లు .
ఎండు మిరపకాయలు --  మూడు
ఆవాలు    ---  స్పూను
ఇంగువ  ---  పావు  స్పూను లో  సగం .

తయారీ  విధానము  .

ఒక గిన్నెలో  తరిగిన  మామిడి  కాయ ముక్కలు , తగినంత    ఉప్పు , కొద్దిగా  పసుపు , మూడు స్పూన్లు  కారం, ముప్పావు స్పూను  మెంతి పిండి  వేసి  స్పూనుతో  బాగా  కలుపు కోవాలి .

తర్వాత  స్టౌ  మీద  పోపు  గరిట  పెట్టి  మొత్తము  నూనె  వేసి  నూనె  బాగా  కాగనివ్వాలి .

తర్వాత  అందులో  ఎండు మిరపకాయలు ముక్కలు , ఆవాలు  మరియు  ఇంగువ  వేసి  వేడి  వేడి  పోపు  పచ్చడి లో  వేసి  స్పూనుతో   బాగా  కలుపుకోవాలి.

తీపి  ఇష్టమైన వారు  చిన్న  బెల్లం  ముక్క పొడి  చేసి  పచ్చడిలో  కలుపుకోవచ్చును .

అంతే  పుల్ల  పుల్ల గా  ఇంగువ  సువాసనతో  మామిడి  కాయ  ముక్కల  పచ్చడి  భోజనము లోకి  మరియు  దోశెల లోకి  సర్వింగ్  కు  సిద్దం.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి